జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడుగా వెళుతున్నారు. తిరుమల డిక్లరేషన్, ఇంగ్లీష్ మీడియం, మతమార్పిడులు, ఉల్లి ధర అంటూ పలు అంశాలపై వైసీపీ సర్కార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని పదే పదే జగన్ రెడ్డి అంటూ, ఆయన కులం, మతంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక అంశంపై స్పందిస్తూ..సీఎం జగన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్ విమర్శలను వైసీపీ నేతలు కూడా ధీటుగా తిప్పికొడుతున్నారు. పార్టీ అధ్యక్షుడై ఉండి పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్‌ను అసలు పట్టించుకునేది లేదంటూ..వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్‌కు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండే రెండు ముక్కలలో పరువును గంగలో కలిపారు. ఏపీ సీఎం జగన్‌పై పవన్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ..తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అదే పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడని, రెండు సార్లు గెలిచిన నేను, రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ మీద మాట్లాడడం ఏంటీ..అయినా ఓడిన వాని గురించి ఏం మాట్లాడాలి సారీ..అంటూ..చెవిరెడ్డి పవన్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు. చెవిరెడ్డి వ్యాఖ్యలతో జనసేన అధ్యక్షుడిగా ఉండి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్‌కు సీఎం జగన్‌కు విమర్శించే స్థాయి లేదంటూ వైసీపీ అభిమానులు అంటున్నారు. మొత్తంగా వైసీపీ ఎమ్మెల్యే సింపుల్‌గా రెండే రెండు ముక్కలలో పవన్ కల్యాణ్ పరువు తీశాడు.
