ఇప్పుడు బంగారం, డబ్బుల దొంగతనాలకు బదులు ఉల్లిగడ్డలు దొంగిలించబడుతున్నాయి. ఇది వింటే కొంత ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం మాత్రం అలాగే ఉంది. ఇప్పటికే పెరిగిన ఉల్లి ధరల పై అనేక రకాల కామెడీ వీడియోలు,మీమ్స్ సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయి.సామాన్యుడు ఇప్పటికే ఉల్లికి సాధ్యమైనంత దూరంగా ఉన్నాడు. ధరలు అమాంతం పెరగడంతో ఉల్లిని దూరంగానే ఉంచుతున్నారు ప్రజలు. ఇంకొంత మంది కొంచెం స్తోమత ఉన్నవారు రేటు ఎక్కువైన కొంటున్నారు.
ఇప్పుడు ఉల్లి ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత మంది కన్ను అటు వైపు పడింది. ఉల్లిని దొంగతనం చేసి అమ్ముకుంటు పబ్బం గడుపుకుంటున్నారు. అయితే తాజాగా తమిళనాడులోని పెరంబదూర్ జిల్లాలో ఏకంగా 350 కిలోల ఉల్లిని దొంగతనం చేసిన ఘటన అక్కడ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.ముత్తు కృష్ణన్ అనే రైతు తన పొలంలో వేసిన ఉల్లి పంటను కోసి ఉంచారు. తెల్లారి పొలంకు వచ్చే సరికి 6 బస్తాలలో ఉంచిన 350 కిలోల ఉల్లి బస్తాలు కనపడకపోయే సరికి దొంగతనం చేశారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు,దీని పై విచారణ ప్రారంబించినట్టు పోలీసులు తెలిపారు, ఉల్లి గడ్డలు దొంగతనం చేయడం ఇదే తొలిసారని , ఇప్పుడు తనకు ఏమిచేయాలో కూడా పాలుపోవట్లేదని ముత్తుకృష్ణను ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఇదే ఉల్లిగడ్డ ఎవరుకొనక కుల్లి పోయిందని,ఇప్పుడేమో చేతికొచ్చిన పంట అధిక రేటు వలన దొంగిలించబడిందని రైతు ఆందోళన చెందుతున్నాడు. ముత్తు కృష్ణన్ కు జరిగిన ఘటనను చూసి ఊరిలోని మిగతా రైతులు తమ ఉల్లి పంటను ఎవరు దొంగతనం చేస్తారో అని రాత్రుల్లు నిద్రమాని పొలాలకు కాపాలా ఉంటున్నారు. అమాంతం పెరిగిన ఉల్లి ఇలా దొంగలకు వరంగా మారింది..