టీడీపీ ప్రభుత్వo రాజధాని నిర్మాణం పేరుతో రైతులు దగ్గరనుండి భూములు సేకరించిఅమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తామమని అంతర్జాతీయ కుంభకోణంగా మార్చారని ఆ ప్రాంత రైతులు తమ బాధను వెళ్లగక్కారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో గుంటూరులో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయంపై వారంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని అన్నారు.
చంద్రబాబు, ఆయన బినామీలు రాజధానిని ప్రకటించకముందే ఇన్‌సైడర్ పేరుతో భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. అలాగే భూములు తీసుకున్న రైతులకు ప్లాట్లు ఇచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది.కానీ తమకు తీరని అన్యాయం జరిగిందని రైతులు మండిపడుతున్నారు. తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలపాలంటూ ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ కాంట్రాక్టులు అన్ని వారి బినామిదారులకే ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు. రాజధాని విషయం లో ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన ఏ నాయకుడిని వదిలిపెట్టమని వారి అవినీతి చిట్టా బయటపెడతామని బుగ్గన వ్యాఖ్యానించారు.