టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా సాగుతోంది. తాను ఒక మొక్కను నాటి మరో ముగ్గురికి మొక్కలు నాటాలని సూచించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి విశేషస్పందన వచ్చింది. సినీ,క్రీడా,రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు సైతం గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఇప్పటివరకు 4.5 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రజలను మరింత భాగస్వాములను చేయడంలో భాగంగా తన బర్త్ డేకి మొక్కలు నాటి ఆ సెల్ఫీని గిఫ్ట్‌గా ఇవ్వాలని కోరారు ఎంపీ సంతోష్. #SelfieWithSaplingOnJSKBirthday అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్ లో షేర్ చేశారు.
తేదీ 07.12.2019 రోజున నా పుట్టినరోజు,
నాకు మీనుండి ఒక బహుమతి కావాలి. pic.twitter.com/8e2mmd6dRy
— Santosh Kumar J (@MPsantoshtrs) December 5, 2019
తనకు బహుమతి ఇవ్వాలనుకునే వారు ట్విట్టర్,ఫేస్ బుక్,వాట్సాప్ ద్వారా మొక్కతో సెల్ఫీ దిగిన ఫోటోను పంపాలని…మీరు పంపించిన సెల్ఫీలతో సోషల్ మీడియా నిండిపోయేలా చేస్తారని భావిస్తున్నానని చెప్పారు సంతోష్ కుమార్. ఇక ఈ నెల 7న పుట్టినరోజు జరుపుకోనున్నారు సంతోష్.