బిగ్ బాస్ ఇది ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అని చెప్పాలి. ఇప్పటికే తెలుగులో వైభవంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు సంబంధించి వచ్చే ఏడాది మొదటినుండి కసరత్తులు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన షోలలో ఏ షో బాగుంది అనే విషయానికి వస్తే కొందరు సీజన్ 1 మొదటిది కాబట్టి అదే బాగుందని, మరికొందరు పెద్ద పెద్ద గొడవలు లేకుండా జరిగిన సీజన్ 3 బాగుందని, ఇంక కౌశల్ ఫ్యాన్స్ అయితే సీజన్ 2 బెస్ట్ అని అంటారు. ఇంక షోల పరంగా పక్కనపెడితే ఆ షోలకు హోస్ట్ ల విషయంలో ఒక్కొకరు ఒక్కో మాట చెబుతారు. మొదటిదానికి ఎన్టీఆర్ హోస్ట్ గా చెయ్యగా, నాని రెండోది, నాగార్జున మూడోది చేయడం జరిగింది. అయితే వీరిలో ఎవరూ ఫేవరెట్ అనే అంటే వెంటనే అందరి నోట వచ్చే మాట తారక్. అయితే ఇప్పుడు రాబోయే సీజన్ కూడా తారక్ నే హోస్ట్ గా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట.
