రాష్ట్రం లో జగన్ ప్రభుత్వ పనితీరుకు ప్రజలలో మంచి స్పందన వస్తుంది. ఇతర పార్టీల నుండి కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ పార్టీ లోకి వస్తున్న వలసలే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.తాజాగా టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి 200 మంది మహిళా కార్యకర్తలు వలస వచ్చారు.
పిఠాపురం తమకు కంచుకోటగా చెప్పుకునే టీడీపీ నేతలకు పట్టణ మహిళా కార్యకర్తలు సుమారు 200 మంది టీడీపీకి రాజీనామాలు చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళ సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలను కొనసాగిస్తు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మహిళలను అన్ని విధాలా ఆదుకోడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే మహిళలు అధిక శాతం మంది వైఎస్సార్ సీపీ వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం గతంలో మహిళలను నమ్మించి మోసం చేసిన వైఖరిని గుర్తుచేస్తూ డ్వాక్రా మహిళలను అప్పుల పాలు చేసిందని విమర్శించారు. నియోజకవర్గంలో మహిళలందరికీ అన్ని వేళలా తాను అండగా ఉంటానని పథకాలు మహిళలకు ఎటువంటి జాప్యం లేకుండా అందజేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలు బాలిపల్లి రాంబాబు పలువురు మహిళలు పాల్గొన్నారు. పార్టీలో చేరిన మహిళలు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సత్కరించారు. క్షేత్ర స్థాయిలో టీడీపీ కనుమరుగయ్యే తరుణం దగ్గరపడిందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అది స్పష్టం అవుతుందని జోత్స్యం చెప్పారు ఎమ్మెల్యే దొరబాబు.