40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతకు దిగాజారిపోయారో అందరికి తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జతకలిసాడు. శుభ్రంగా సినిమాలో నటించుకుంటూ పవర్ స్టార్ అనిపించుకునేవాడు అలాంటిది ఎవరినో ప్రశ్నిస్తాను, ఎదో చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాసాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ తీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ ప్రశ్నించకుండా సైలెంట్ అయిపోయాడు. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పిన పవన్ మల్లా ఆ గూటికే చేరాడని అందరికి అర్దమైంది. ఆ ఎన్నికల్లో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఘోరంగా ఓడిపోయారు. అయినా చంద్రబాబుకి బుద్ధిరాలేదనుకుంట ఏవోక కారణాలతో ప్రభుత్వం పై బురద జల్లాలని కుళ్ళు, కుతంత్రాలతో ముందుకు వెళ్తున్నాడు. ఈమేరకు తాజాగా దత్తపుత్రుడైన పవన్ ను వదిలాడు. ఎంత పవన్ వచ్చినా ఏమీ చెయ్యలేరని అర్ధమయింది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “ఒకాయన 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఇంకొకాయన అజ్ణానాంధకారాన్ని కవర్ చేసుకునేందుకు రాజ్యాంగాన్ని ఔపోసన పట్టానంటాడు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇంత నీచత్వానికి పాల్పడాలా అని ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారి పోయారిద్దరూ” అని అన్నారు.
