తమిళ నటుడు ఈశ్వర్ రఘునాథన్‌తో జయశ్రీ రావు వివాహం 2016లో జరిగింది. కొంతకాలం నుంచి వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. గృహ హింస, భార్యపై శారీరక దాడి ఆరోపణలపై నటుడు ఈశ్వర్ రఘునాథన్‌ను తమిళనాడు పోలీసుల అరెస్ట్ చేశారు. భార్య జయశ్రీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకొనగా.. ప్రస్తుతం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆమె ఆస్తి పత్రాలను తాకట్టు పెట్టుకొని రూ.30 లక్షలు లోన్ తీసుకున్నాడని, వాటిని తిరిగి కట్ట లేకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగాయని, వారిద్దరి మధ్యా గొడవలు పెరిగాయని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈశ్వర్ తన సహ నటి అయిన మహాలక్ష్మీతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే వీటన్నంటికి కారణమని తెలుస్తోంది. దేవతయై కండేన్ అనే సీరియల్‌లో ఈశ్వర్ హీరోగా నటిస్తుండగా.. అదే సీరియల్‌లో విలన్ రోల్ పోషిస్తున్న మహాలక్ష్మీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని అతని భార్య పేర్కొంది. తన ముందు, తన కూతురు ముందే ఆమెకు వీడియో కాల్ చేసి అలాంటి విషయాలు మాట్లాడేవాడని చెప్పుకొచ్చింది. తన భర్తకు తాగుడు అలవాటుందని పెళ్లికి ముందే తెలుసునని, కానీ ఇలాంటి చేస్తాడని అనుకోలేదని చెప్పుకొచ్చింది. రోజూ తాగి వచ్చి తనను కొట్టేవాడని, విడాకులు కూడా అడిగే వాడని చెప్పుకొచ్చింది. తాను విడాకులు ఇస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడని తెలిపింది. మహాలక్ష్మికి వివాహం జరిగిందని, ఒక కుమారుడు కూడా ఉన్నారని, రఘునాథ్ తనను తండ్రి అని పిలవాలని పట్టుబడతాడని చెప్పుకొచ్చింది.