ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఓఎస్డీగా ఎస్.బి.శంకర్ నియమితులయ్యారు.. గతంలో ఆయన సీబీఐలో ఎస్పీ (నాన్ క్యాడర్)గా పనిచేసి ఈ ఏడాది జులైలో పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో శంకర్ ను జాయింట్ డైరెక్టర్ హోదాలో ఆయనను ఓఎస్డీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏసీబీ న్యాయ సలహాదారు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా హెచ్.వెంకటేశ్‌ను ప్రభుత్వం నియమించింది. వీరిద్దరూ మొత్తం మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
