టీమిండియా సారధి విరాట్ కోహ్లి టెస్ట్ ర్యాంకింగ్స్ లో భాగంగా బ్యాట్టింగ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ ను వెనక్కు నెట్టేసి 928పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్ 923పాయింట్స్ తో రెండో ప్లేస్ లో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతో ఘనవిజయం సాధించింది. ఇందులో భాగంగా కోహ్లి కూడా తనదైన శైలిలో అద్భుతమైన బ్యాట్టింగ్ ఆడాడు. దాంతో టెస్టుల్లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఒక టెస్ట్ లోనే కాకుండా అన్ని ఫార్మాట్లో ముందంజులో ఉన్నాడు.
