జనసేన పార్టీ త్వరలోనే జెండా ఎత్తేయబోతుందా.. అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపితే..తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారా..ప్రస్తుతం ఏపీలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..త్వరలోనే జనసేన దుకాణం బంద్ కావడం తథ్యమనిపిస్తుంది. తాజాగా దేశానికి మోదీ, అమిత్‌షా వంటి నేతల అవసరం ఎంతైనా ఉంది..నెమ్మదిగా చెబితే వినే రోజులు పోయాయి..అందుకే వైసీపీ వాళ్లను చూసి భయపడుతుందంటూ..పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లివచ్చిన తర్వాత పవన్ వైసీపీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మతం, కులంపై వ్యక్తిగతంగా విరుచుకుపడుతున్నాడు. దీని వెనుక ఓ రహస్య ఎజెండా ఉందనే వాదనలు బలపడుతున్నాయి. పార్టీని నడపడం పవన్ కల్యాణ్‌కు తలకు మించిన భారం అయిపోయింది. ఒక వైపు ముఖ్య నాయకులంతా పార్టీని వీడిపోతున్నారు. మరోవైపు పవన్ బాబు పార్టనర్ అన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. పవన్ ఎంతగా పోరాటం చేసినా..చంద్రబాబు పార్టనర్ అనే ముద్ర పడిపోతుంది. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీని నడిపేంత ఓపిక, తగిన ఆర్థిక వనరులు పవన్‌కు లేవు. ఈ నేపథ్యంలో పార్టీని బీజేపీలోకి విలీనం చేసే దిశగా జనసేనాని ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లోనే బీజేపీతో పొత్తు కోసం పవన్ ప్రయత్నించాడు..కాని పార్టనర్ చంద్రబాబు అడ్డుకున్నాడు. ఇక ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని బలహీనపర్చేందుకు ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. చంద్రబాబును కేసుతో నయానో, భయానో లొంగదీసుకుని, తమ పార్టీలో టీడీపీని పూర్తిగా విలీనం చేసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక రాజకీయంగా పవన్ కల్యాణ్ పెద్దగా ప్రభావితం చేయకపోయినా..ప్రజల్లో ఆయనకున్న ఛరిష్మా ఉపయోగపడుతుందని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తుంది. అందుకే జనసేన పార్టీని కూడా విలీనం చేసుకునేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ నేతలు సంకేతాలు అందించినట్లు టాక్.. వచ్చే ఎన్నికల నాటికి పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని కూడా పార్టీలో జాయిన్ చేసుకుని, ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని బీజేపీ స్కెచ్ వేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ కంటే చిరంజీవికే ప్రజల్లో మంచి ఇమేజ్ ఉందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంట… అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి చిరంజీవిని సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించి..పవన్ కల్యాణ్‌కు ఢిల్లీలో పార్టీలో ఏదైనా పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పవన్‌కు కూడా తన అన్నను సీఎంగా చూడాలని కోరిక కాబట్టి..ఢిల్లీ పెద్దల ప్రపోజల్‌కు అంగీకరించి..పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే బీజేపీ పెద్దల నుంచి సంకేతాలు అందుకున్న తర్వాత జగన్‌పై క్రిస్టియన్ ముద్రవేసి, హిందూవులను వైసీపీకి దూరం చేసేందుకు పవన్ దూకుడుగా వెళుతున్నాడని..రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అవసరమైతే హిందూ, క్రిస్టియన్ల మధ్య విద్వేషాలు రగిలించేలా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా..బీజేపీ స్కెచ్‌లో భాగమే అని భోగట్టా..అయితే ఎప్పుడు ఏ మాట్లాడుతాడో తెలియని పవన్ సెక్యులరిజానికి అడ్డం హిందూ నాయకులే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పవన్ ఈ మేరకు ఢిల్లీ పెద్దలకు సారీ కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అమిత్‌షా, మోదీలపై పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కూడా స్పందించింది. జనసేన పార్టీని బీజేపీలో కలిపేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. జనసేనను విలీనం చేయాలని అమిత్ షా అడిగారని గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా నాని గుర్తు చేశారు. వైసీపీ విమర్శలను పక్కన పెడితే..నిజంగానే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా పవన్ అడుగులువేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా త్వరలోనే ఏపీలో జనసేన జెండా ఎత్తేయడం ఖాయమని తెలుస్తోంది. మరి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడో లేదో చూడాలి.