హైదరాబాద్‌లో దిశపై జరిగిన అమానుష హత్యాకాండపై యావత్ దేశం రగిలిపోతుంది. ఇంతటి దారుణానికి తెగబడ్డ నలుగురు నిందితులను బహిరంగంగా ఉరితీయాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం దిశ కేసుపై చిత్ర విచిత్రంగా స్పందించారు. రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ..హైదరాబాద్‌లో దిశ అనే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన నలుగురు నిందితులను పోలీస్‌స్టేషన్‌లో పెడితే వేల మంది జనం వెళ్లి..చంపేయండి..ఉరి తీసేయండి అంటున్నారు. అలాగే ఒక రేప్ కేసులో ఢిల్లీలో ఒక జడ్జి..మగవాళ్ల మర్మాంగాలు కోసేయండి అన్నారు..ఒక జడ్జికి కూడా అంత కోపం వచ్చిదంటే..అసలు మీరు అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారు..ఒక ఆడపిల్లపై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిన వారిని అందరూ చూస్తుండగా.. చెమడాలు వూడిపోయేలా రెండే రెండు బెత్తం దెబ్బలు కొట్టండి..అంతే కాని నడి రోడ్డుమీద అందరూ చూస్తుండగా ఉరి తీయమంటున్నారు..ఒక మనిషిని చంపే హక్కు లేదు…అంటూ తనదైన స్టైల్లో లెక్చర్ ఇచ్చాడు. దిశ ఘటనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిందితులను ఉరితీయద్దు, రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయండి అనేలా ఉన్నాయి. అమాయకురాలైన ఆడపిల్లపై ఇంతటి అమానుషానికి పాల్పడ్డ నిందితులను బహిరంగంగా ఉరితీయాలని యావత్ దేశం ముక్తకంఠంతో నినదిస్తుంటే..పవన్ మాత్రం రెండు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో పవన్ మానసిక స్థితిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక పార్టీ అధినేత అయి ఉండి…రేపిస్టులను వెనకేసుకువస్తున్నావు..ఛీ ఛీ…రేపిస్టుల కంటే దారుణంగా మాట్లాడుతున్నావు..అంటూ మహిళాలు పవన్ కల్యాణ్‌పై మండిపడుతున్నారు. ఇక చంద్రబాబుతో సహవాసం చేసే పవన్ ఏం చేస్తున్నాడో..ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు.. పవన్ అజ్ఞాతవాసి కాదు…అజ్ఞానవాసి.. వీడి చర్యలు ఊహాతీతం వర్మ..దట్స్ ద ప్యాకేజీ బ్యూటీ అంటూ నెట్‌జన్లు సెటైర్లు వేస్తున్నారు. దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
