ఆశ్రమంలో పిల్లల నిర్బందం, బలవంతంగా పిల్లలతో విరాళాల సేకరణ పై ఆరోపణలు ఎదుర్కుంటు పోలీసులకు వాంటెడ్ గా మారిన వివాదస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద ఇప్పుడెక్కడున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యానంద కోసం వెతుకున్నారు, కానీ తన ఆచూకి ఎక్కడ లభించలేదు. బహుశ దేశం వదిలి పారిపోయుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అనుమానాలు నిజమయ్యేలా ఇప్పుడు నిత్యానంద ఒక సపరేట్ దేశాన్నే సృష్టించుకున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక న్యూస్ ఏజెన్సీ నిత్యానంద గురించి ముఖ్యమైన వివరాలను సేకరించింది. నిత్యానంద కైలాస అనే పేరుతో సొంత హిందూ దేశాన్ని నిర్మించుకన్నాడని, ఆ దేశానికి ప్రత్యేక పాస్ పోర్ట్,ప్రత్యేక క్యాబినేట్ ,ప్రధానిని కూడా నియమించినట్టు ప్రచారం సాగుతోంది.
హిందూదేశ నిర్మాణం కోసం ఇప్పటికే వెబ్ సైట్ ద్వారా తన అనుచరులు విరాళాలు సేకరిస్తున్నారు. విరాళాల సేకరణకు ప్రత్యేక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవ్వరైన ఈ హిందుదేశంలో పౌరసత్వం పొందవచ్చట. ఈ దేశానికి సరిహద్దులుండవని,సనాతన హిందూదర్మాన్ని కోరుకునే వారు తమ దేశంలో సభ్యత్వం చేసుకోవచ్చని వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు సమాచారం. ఈ హిందూ కైలాస దేశం కు రిషభ ద్వజా పేరు తో జెండా ను రూపొందించి, జెండా పై నంది మరియు నిత్యనందుని ఫోటోలు కూడా ఏర్పరిచారు. తమని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిత్యానందుడి లీగల్ టీం ఐక్యరాజ్యసమితిలో సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. ఈక్వడార్ నుంచి ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసి దానిని హిందూదేశం గా మార్చినట్టు సమాచారం,కానీ దాని పై ఇంకా స్పష్టత లేదు. వెబ్ సైట్ ప్రకారం కైలాస దేశానికి సరిహద్దులుండవు,హిందుత్వాన్ని ప్రచారంచేయటమే దాని అజెండా అని వెబ్ సైట్ లో వివరించారు.