టీఎస్‌ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ శిల్పాకళావేదికలో టీఎస్‌ఐపాస్ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్ ఒక రోజంతా చర్చించి.. టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నాం. ఓఆర్‌ఆర్ వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు చెల్లిస్తాం. ఒక పరిశ్రమకు రాయితీ ఇస్తే వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. హైదరాబాద్ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఫార్మా సిటీ కోసం 10 వేల ఎకరాలు సేకరించాం. ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తల రూ. 305 కోట్ల రాయితీలు అందజేశాం అని కేటీఆర్ తెలిపారు. ఈ వేడుకలకు మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జయేశ్ రంజన్, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మాదాపూర్ శిల్పకళావేదికలో జరిగిన టీఎస్-ఐపాస్ ఐదో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రులు శ్రీ @KTRTRS మరియు శ్రీ @chmallareddyMLA. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాధికారులు, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. #TSiPASS#5YearsOfTSiPASS pic.twitter.com/2YARvDLO5u
— TRS Party (@trspartyonline) December 4, 2019