ఏపీ సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మంత్రి పదవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్రెడ్డి తనకు నమ్మి మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. మంత్రిగా ఉండి చంద్రబాబు పై తెలుగుదేశం పార్టీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నకు నాని స్పందించారు. మంత్రి పదవి ఉంది కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారని లేకపోతే జగన్ పై ఈగ వాలకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ నాని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నాని ఇవే విషయాలు ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పుడు నేను తనతో లేనని ఆయన చిన్నప్పుడే ఆయన యోగ క్షేమాలు చూసుకున్నానని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తాను టిడిపిలో లేనని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తాను టిడిపికి పనిచేశానని చెప్పారు. అలాగే హరికృష్ణ టిడిపిని విభేదించి బయటకు వచ్చిన తర్వాత హరికృష్ణతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్న విషయాన్ని తెలిపారు. అలాగే జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్నప్పుడే తాను వెళ్ళి పార్టీలో జాయిన్ అయ్యాను అని అధికారం కోసం ఎప్పుడు తాను పరుగెట్ట లేదని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి లేకపోతే జగన్ పై ఈగ వాలకుండా తానే చూసుకుంటానని సీఎం జగన్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచాడు మంత్రి నాని.