Home / ANDHRAPRADESH / పవన్ కు రాజకీయ పార్టీని నడిపే అర్హత ఉందా.?

పవన్ కు రాజకీయ పార్టీని నడిపే అర్హత ఉందా.?

కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలలో మత విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్‌..గుడ్డిగా చంద్రబాబును అనుసరిస్తున్నారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌ కల్యాణ్‌.. నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గృహహింస కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న దొంగ పవన్‌ కల్యాణ్‌ అని విమర్శించారు. అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు ఒక రాజకీయ పార్టీ పెట్టే అర్హత లేదని, ఎన్నికల సంఘం ఒకసారి పునఃపరిశీలన చేసి ఉండాల్సిందని అసలు ఎన్నికలలో పోటీ చేసేందుకు పవన్ కు అర్హత ఉందా అంటూ విమర్శించారు.

 

 

చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్‌కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనను చూసి ఓర్వలేకనే చంద్రబాబు, పవన్‌ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. బాబు, పవన్ ల దృష్టిలో అభివృద్ధి అంటే ఏమిటో చెప్పాలని .. జగన్ ఇప్పటి వరకు చేపట్టిన ఏ సంక్షేమ కార్యక్రమంవల్ల ప్రజలకు లబ్ది చేకూరట్లేదో వారిద్దరూ చెప్పాలని ప్రశ్నించారు. అభివృద్ది అంటే 2050 లో ఎలా ఉండాలో కాదని ప్రస్తుతం ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచుకుంటూ దీర్ఘకాలిక అభివృద్ధిని చేపట్టడమే తమ లక్ష్యంగా జగన్ మండదుగు వేస్తున్నారని చెప్పుకొచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat