మాజీ మంత్రి, నారాయణకు అనంతపురం పర్యటనలో తీవ్ర భంగపాటు ఎదురుపడింది. నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ ప్రభుత్వం లో మంత్రిగా వ్యవహరించి పార్టీ కి ఆర్ధిక వనరులు అందించే వ్యక్తిగా పెరు గాంచిన మాజీ మంత్రి నారాయణ పై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఫీజులు ఉండాలని దానికి వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని నిలదీశారు. ఐతే విద్యార్థులను నారాయణ అనుచరులు అడ్డుకోవదానికి ప్రయత్నించగా ఇరువర్గాల మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనతో నారాయణ అనుచరులు విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్ధుల జీవితాలతో వ్యాపారం చేస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో కొందరు నారాయణను చుట్టుముట్టి చొక్కా పట్టి లాగారు. సార్ను చొక్కా పట్టుకొని లాగుతారా అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాజీ మంత్రి నారాయణ కారుపై రాళ్లతో దాడి చేశారు. విద్యార్థుల దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ అనుచరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో నారాయణ అనంతపురం పర్యటనను సంఘంలోని ముగించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.గత ప్రభుత్వం లో వారు చేసిన అవినీతి తాలూకు ప్రతిఫలాలు ఈ స్థాయిలోనే ఉంటాయని రాష్ట్రంలో అక్కడ చూసినా టీడీపీ నాయకుల పర్యటనల్లో ఈవిధమైన నిరసనలు తప్పవని కొందరు విద్యారి సంగా నాయకుకు ఎద్దేవా చేస్తున్నారు.