దిశ ఘటనలో నిందితులైన రేపిస్టులను బెత్తంతో చర్మం వూడేలా కొట్టండి..అంతే కాని చంపే హక్కు లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో సహవాసం చేసిన తర్వాత పవన్ విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక..పిచ్చివాగుడు వాగుతున్నాడని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక రేపిస్టుల విషయంలో పార్టనర్లు చంద్రబాబు, పవన్‌లు ఒకటే విధంగా స్పందిస్తున్నారంటూ గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తున్నారు. గతంలో ఓ బాలింతపై అమానుషంగా అత్యాచారం చేసిన ఓ టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు స్వయంగా శ్రమశక్తి అవార్డు ఇచ్చి ప్రోత్సహించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లో వెళితే..2010 వ సంవత్సరంలో విశాఖ అగనంపూడి కాలనీకి చెందిన కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర ముత్యాలు అనే టీడీపీ కార్యకర్త ఓ బాలింత ఇంటిపై కప్పు చీల్చి దూకి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ రేప్ ఘటనలో సదరు టీడీపీ కార్యకర్తను గాజువాక పోలీసులు అరెస్ట్ చేసి, కేంద్ర కారాగారానికి తరలించారు. కొన్నాళ్ల తర్వాత రాజకీయ పలుకుడి ఉపయోగించి ఈ కేసులో బెయిల్‌పై వచ్చాడు. అయితే ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకే బాలింతపై అత్యాచారం చేసిన ఈ టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు స్వయంగా శ్రమశక్తి అవార్డు ఇవ్వడం గమనార్హం. నాటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ కత్తి తిలక్ ప్రదీప్ అనే కార్యకర్తకు అవార్డు ఇవ్వాల్సిందిగా సిఫార్స్ చేశారంట..ఇలాంటి రేపిస్ట్‌కు చంద్రబాబు శ్రమశక్తి అవార్డు ఇచ్చి పరువు పొగొట్టుకుంటే..ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్ ఏమో రేపిస్టులను చంపే హక్కు లేదంటూ పరుగు పోగొట్టుకున్నాడు. మొత్తంగా రేపిస్టులను వెనకేసురావడంలో పార్టనర్లు ఇద్దరూ ఇద్దరే అని ఈ రెండు ఘటనలతో రుజువైంది.
