Home / POLITICS / త్వరలో పౌల్ట్రీ పాలసీ.. మంత్రి తలసాని

త్వరలో పౌల్ట్రీ పాలసీ.. మంత్రి తలసాని

దేశంలోనే అత్యున్నతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే రూపొందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పౌల్ట్రీ రంగం అభివృద్ధి పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరులతో మాట్లాడారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు. పౌల్ట్రీ రంగ అభివృద్దికి రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు చర్చించారు.

కమిటీ చైర్మన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ళ పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని, పేద రైతులకు సబ్సిడీపై పెరటి కోళ్ళ యూనిట్లను సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. దీనివలన పేద రైతులకు గ్రుడ్డ్లు మరియు కోడి మాంసం అమ్మకం వలన అదనపు ఆదాయం లబిస్తుందని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రం ప్రతిరోజు 3.2 కోట్ల గ్రుడ్ల ఉత్పత్తి తో దేశంలో 3 వ స్థానంలో ఉందని, బ్రాయిలర్ కోళ్ళ ఉత్పత్తిలో 5 వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 6 లక్షల మందికి ఉపాది లబిస్తుందని వివరించారు. నూతనంగా రాష్ట్రం లో పౌల్ట్రీ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరచుటకు అన్ని పౌల్ట్రీ ఫాం లను రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ప్రవేశపెట్ట నున్నట్లు తెలిపారు. ఈ రంగాన్ని భారీ ఎత్తున ప్రోత్సహించడానికి అవసరమైన అంశాలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఉత్తమమైన పాలసీని రూపొందించటానికి కమిటీ ఇతర రాష్ట్రాలలో పర్యటించి అక్కడ అమలు అవుతున్న విధానాలను అధ్యయనం చేస్తుందని అయన తెలిపారు. మన రాష్ట్రంలో కోళ్ళ రంగం గణనీయమైన వృద్దిని సాదించినప్పటికీ గ్రుడ్లు మరియు మాంసం వినియోగాన్ని పెంచి మరియు ఇతర రాష్ట్రాలకు మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి పర్చటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో సబ్సిడీపై కోళ్ళ దాణా, ఇతర సదుపాయాలు కల్పించడం ద్వారా అవసాన దశలో ఉన్న పౌల్ట్రీ రంగానికి కొత్త జీవితాన్ని ఇచ్చారని సమావేశంలో పాల్గొన్న పౌల్ట్రీ రంగ ప్రతినిధులు ముక్త కంఠంతో ప్రశంసించారు. రాష్ట్రంలో ఉన్న చిన్న, పెద్ద పౌల్ట్రీ ఫారం ల జాబితాను వెంటనే జిల్లాల వారిగా సేకరించాలని డైరెక్టర్ లక్ష్మారెడ్డి రెడ్డిని కమిటీ ఆదేశించింది. పౌల్ట్రీ రంగంలో అంతర్జాతీయ అవసరాలకు దీటుగా ఉత్పత్తులను సాధించుటకు అనువైన మార్కెట్ లను సమకూర్చుకోవడం ద్వారా ప్రస్తుతం ఉన్న మాంసం ఉత్పత్తులను అభివృద్ధి పరచుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పాలసీల ద్వారా పౌల్ట్రీ రంగంలో సాధించే ఉత్పత్తి వ్రుద్దిరేతుకు అనుగుణంగా మార్కెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. పౌల్ట్రీ రంగంలో మానవ వనరుల అభివృద్ధి ఎంతో అవసరం. ఇందుకు గాను పౌల్ట్రీ విద్యను ITI, పాలిటెక్నిక్, డిగ్రీ స్థాయిలలో అందజేయడానికి కావాల్సిన సదుపాయాలను కూడా అన్వేషించాల్సి ఉందన్నారు. బ్రాయిలర్ కోళ్ళ పెంపకం హైదరాబాద్ చుట్టుప్రక్కల ఎక్కువ కేంద్రీకృతమై ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో కోళ్ళ వ్యాధుల నిర్దారణకు, వ్యాధులను అరికట్టగల సమర్ధవంతమైన యంత్రాంగం కలిగి ఉందన్నారు. మన రాష్ట్రంలో రాజశ్రీ, డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ రిసెర్చ్ లో అభివృద్ధి చేసిన గ్రామప్రియ, కృషి బ్రో వంటి జాతులు మాంసం ఉత్పత్తికే కాకుండా 120-140 గ్రుడ్ల ఉత్పత్తితో రైతులకు లాభదాయకంగా పౌల్ట్రీ రంగానికి గోదాముల ఏర్పాటుకు అవసరమైన అంశాలపైన కమిటీలో చర్చిస్తామని తెలిపారు. పౌల్ట్రీ రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికను రూపొందించి ముఖ్యమంత్రికి అందజేయడం జరుగుతుందని అన్నారు. తిరిగి ఈ నెల 13 వ తేదీన కమిటీ సమావేశం అవుతుందని అన్నారు.

మన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాలు, అంగన్ వాడి లలో 28 లక్షల మంది విద్యార్ధులకు వారానికి 3 గ్రుడ్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇది విద్యార్ధులకు ఆరోగ్యంతో పాటు పౌల్ట్రీ రంగం అభివృద్దికి దోహదం చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న పౌల్ట్రీ రంగ ప్రతినిధులు ముఖ్యంగా ప్రస్తుతం గ్రుడ్డు ఉత్పత్తి వ్యయం మరియు మార్కెట్ ధరల మద్యలో వ్యత్యాసం అధికంగా ఉండి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. దీనికై ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. ఇందులో భాగంగా కోడి గ్రుడ్డుకు మద్దతు ధర, కోళ్ళ దాణా లో ముఖ్యమైన మక్కజోన్నల లభ్యత మరియు వాటి ధరపై నియంత్రణ ఉండాలని, రాష్ట్రంలో అధునాతన కోళ్ళ వ్యాధి నిర్ధారణ ల్యాబరేటరీ, కోల్డ్ చైన్ వసతులు కల్పించాలని విన్నవించారు. పౌల్ట్రీ పరిశ్రమకు ప్రభుత్వం యూనిట్ కు 2 రూపాయల విద్యుత్ సబ్సిడీ ఇస్తుందని, దీని స్థానంలో పౌల్ట్రీ రంగానికి ప్రత్యేక విద్యుత్ టారీఫ్ ఇవాలని కోరారు. అన్నారు. ప్రభుత్వ పరంగా కావలసిన అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, అందుకు కావలసిన విధివిధానాలను ఏర్పరచుకొని దేశంలోనే పౌల్ట్రీ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat