తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మత కుల ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన పరువు దిగజార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మత ఘర్షణలకు హిందువులు హిందూ నాయకులు కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ఒక చిల్లర్ పార్టీ అని అతన్ని ఎవరూ పట్టించుకోరని అయితే తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలన్నారు. ఏపీ బీజేపీ నేతలు కూడా పవన్ వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు లౌకిక దేశంలో ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని పవన్ కళ్యాణ్ కి నా హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
Home / ANDHRAPRADESH / రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..!
Tags ap jsp meetings pavan kalyan religions talking