Home / NATIONAL / దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?

దేశమంతా పెరుగుతున్న ఉల్లి లొల్లి.. ఇంకా ఎంతకాలం ?

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయ సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇప్పటికే ఉల్లి రికార్డు ధర పలుకుతు ప్రజలను ఉల్లికి మరింత దూరం చేస్తుంది. కిలో ఉల్లి ధర రూ 100 దాటింది. దీంతో వంటలో ఉల్లి ని వేద్దామంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. సాధారంణంగా ఇండియా లో ఏ వంటలో అయిన ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.కానీ ఇప్పుడున్న ఉల్లి కరువుతో రేటు అమాంతం పెరగడంతో దాన్ని చూస్తేనే సామాన్యులు కొనలా వద్దా అని ఆలోచిస్తున్నారు.

రెస్టారెంట్లు,హోటల్స్,రోజు వారి వ్యాపారాలు చేసుకునే వారు చేసే వంటల్లో ఉల్లి తప్పని సరి,డిమాండ్ పెరిగి ఉల్లి సప్లై తగ్గడంతో వారు కూడా తమ మెనులలో ఉల్లి తొలగించి వండేలా చర్యలు తీసుకుంటున్నారు. హోటల్ కు వెళ్లే కస్టమర్ ఏ రకం ఆహారం తిన్న దానితో పాటు ఉల్లిని తినడం అలవాటు,అందువలన హోటల్ యాజమాన్యాలకు ఇప్పుడు ఉల్లి సమస్య చాలా తలనొప్పులు తెస్తుంది. కొన్ని రెస్టారెంట్లలో ఇప్పటికే ఉల్లిపాయ ఉండదు అని బోర్డులు పెడితే మరికొన్ని చోట్ల ఉల్లికి కూడా సపరేట్ ఛార్జ్ వేస్తున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు,హోటల్స్ లో తమ ఆహారంలో సపరేట్ ఉల్లి కావాలనుకునే వారికి ఎక్స్ ట్రా ఛార్జ్ చేసి ఉల్లిని అందిస్తున్నారు.

అస్సలు ఎందుకు ఉల్లి ధర ఇంత పెరిగింది అంటే..సాధారణంగా మూడు సీజన్లలో ఇండియాలో ఉల్లిని పండిస్తారు.రబీ సీజన్ లో ఎక్కువగా ఉల్లి పండిస్తారు. దేశ మొత్తానికి సరఫరా అయ్యే ఉల్లి లో 60 శాతం రబీ పంట ద్వారా నే సమకూరుతుంది. ఖరీఫ్ సీజన్ లో సాగయ్యే పంట నవంబర్ లో ఎక్కువగా చేతికి వస్తుంది. కానీ ఈ సారీ అకాల వర్షాలు పడటం వలన మహారాష్ట్ర,కర్నాటక,మధ్య ప్రదేశ్,రాజస్థాన్ లో ఉల్లి పంట దెబ్బతింది. అంతేకాకుండా గత సంవత్సరం కన్నా ఈ సారి ఖరీఫ్ లో ఉల్లి సాగు మహారాష్ట్ర,కర్నాటక లో తగ్గింది . ఇది కూడా ఒక కారణం.దీని వలన ఉల్లి సరఫరా జరగక రేటు అమాంతం పెరిగింది. ఎక్కువగా దేశానికి ఉల్లి సప్లై చేసే మహారాష్ట్ర,కర్నాటక లో ఈ సారి ఉల్లి పంట తక్కువగా పండించడంతో ఆ ప్రభావం దేశవ్యాప్తంగా పడింది.అలానే మద్యప్రదేశ్ లో పండించిన పంట నిల్వ చేయడానికి సరైన సౌకర్యాలు లేవు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉల్లి స్టోరేజ్ కు ఆధునిక పద్దతులు పాటిస్తే భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు రాకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

ఇప్పటికే భారత ప్రభుత్వం ఈజిప్ట్ నుండి దాదాపు 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటుంది. ఇది దేశానికి చేరటానికి ఇంకొంచెం టైమ్ పడుతుందని , అలాగే ఖరీఫ్ పంట కూడా ఈ నెల చివర్లో చేతుకు వస్తుందని,డిసెంబర్ రెండో వారంలో పరిస్థితి దాదాపు అదుపులో ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat