Home / 18+ / నాని ఇటు విలన్, అటు లవర్ బాయ్..తేడా వస్తే అంతే సంగతులు !

నాని ఇటు విలన్, అటు లవర్ బాయ్..తేడా వస్తే అంతే సంగతులు !

ఈ యేడాది నాని ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్న నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. హీరోగా నానికి ఇది 25వ చిత్రం కావడం అందులోనూ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నాని నటించడం విశేషం. ఈ సినిమా తర్వాత నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్ ను  ఇప్పటికే ఖరారు చేసారు.

 

 

‘టక్ జగదీష్’ టైటిల్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో నాని టక్ చేసుకొని వెనకాల ఉన్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నాని టక్ చేసుకొని కనిపించడంతో నాని పాత్రపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  సినిమాను ‘మజిలీ’ సినిమాను నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా తీయనున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కావలసిఉన్నది. ఈ చిత్రం లోని నటీనటుల వివరాల పై సరైన స్పష్ఠత రావాలిసిఉంది.నాని నటించబోతున్న 26 వ చిత్రం అభిమానులను ఏ స్థాయిలో అలరించబోతున్నదో వేచిచూడలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat