టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కెప్టెన్ కాకముందు అదే ఆట కెప్టెన్ అయ్యాక కూడా అదే ఆటతో ముందుండి జట్టుని నడిపిస్తూ ఎన్నో విజయాలు సాదిస్తున్నాడు. అయితే అటు గ్రౌండ్ లో ఇటు మీడియా ముందు ఎక్కడైనా సరే ఎంతో సరదాగా ఉండే కోహ్లి ఇప్పుడు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి నే దీనికి కారణం. ఆయనను సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ చేస్తారో అందరికి తెలిసిన విషయమే. అతడంటే ఎవరికీ పడదనే చెప్పాలి. అతడి ఫోటోలు పెట్టి పక్కన మందు సీసాలు పెట్టి మరీ ట్రోల్ చేస్తారు. ఈ విషయంలో పూర్తిగా మండిపడ్డ కోహ్లి ఆయన టాలెంట్ కోసం మీకేం తెలుసు 10వ స్థానం నుండి ఓపెనర్ గా వచ్చి జట్టు కి ఎన్నో విజయాలు అందించాడు. అలాంటి వారిని ఎలా ట్రోల్ చేస్తారు. వీలైతే అతను సాధించిన ఫీట్ ను మీరు చేసి చూపించండి అని అన్నాడు.
