ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గొంగిడి సునీత భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారుల అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ రహదారుల అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. సీఎం కేసీఆర్ రాసిన వినతి పత్రాలను కేంద్రమంత్రికి అందజేసినట్లు చెప్పారు. గతంలో రాష్ర్టానికి 3,150 కిలోమీటర్ల రహదారులు మంజూరు చేశారన్నారు. వీటిలో 680 కిలోమీటర్లకు గుర్తింపు సంఖ్య ఇవ్వలేదని వీటికి గుర్తింపు సంఖ్యలను ఇవ్వాల్సిందిగా కోరామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారులు పాడయ్యాయన్నారు. వీటి మరమ్మతులు త్వరితగతిన చేయించాలని కోరామన్నారు. అదేవిధంగా వరంగల్-భూపాలపల్లి రహదారిలో రెండు అండర్ పాస్‌లు.. ఆలేరు- నియోజకవర్గంలో రెండు అండర్ పాస్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించామన్నారు. టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. గతంలో హామీ ఇచ్చిన జాతీయ రహదారుల నిర్మాణ అంశం పెండింగ్ లో ఉంది. రిజనల్ రింగ్ రోడ్డు అంశంలో రాష్ర్ట ప్రభుత్వం తరుపున 50 శాతం భరిస్తామని చెప్పినం. ఇందుకు నంబరింగ్ ఇచ్చి పనులు వేగవంతం చేయాలని కోరినమని నామా తెలిపారు.
