జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజురోజుకి చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మానసిక పరిస్థితి బా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లీషులో తాను సెవెంత్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంగ్లీషులో బోధన చేస్తున్నారని అందుకే చదువు ఆపేశాను అని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సారి తాను ఎంపీసీ చదివాను అని మరోసారి సీసీ చదివాను అని ఇంకోసారి చదివానని ఓసారి డాక్టర్ అవ్వాలనుకున్నాను అని ఇంకోసారి నక్సలైట్ అవుదామనుకున్నా అని ఇంకోసారి తుపాకితో కాల్చుకొని చచ్చిపోతావ్ అనుకున్నాను అని ఇలా ఇష్టానుసారంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే తాజాగా రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిగిన దిశ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను వ్యాఖ్యలు చేశారు. అలాగే భారతి సిమెంట్ పెట్టుకోడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని దశాబ్దానికి పైగా పెట్టిన జగన్ కంపెనీల గురించి మాట్లాడారు ఇంతవరకు ఎలా ఉన్నా ప్రస్తుతం రాష్ట్రంలో మత ఘర్షణలకు హిందువులే కారణమంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా భగ్గు మంటున్నారు. పవన్కళ్యాణ్ హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు తన మాటలు అదుపులో పెట్టుకోవాలని హిందూ మత పెద్దలు హెచ్చరిస్తున్నారు