రకుల్ ప్రీత్ సింగ్…టాలీవుడ్ లో అడుగుపెట్టిన క్షణం నుండి ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ అదే లెవెల్ లో ఉంది. ఇండస్ట్రీలో అగ్రనాయకులు అందరితో నటించిన హీరోయిన్ రకుల్ నే. అటు నటనలోనే కాదు బిజినెస్ పరంగా కూడా తనకి ఎవరూ సాటిలేరు అని నిరూపించుకుంది. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన లైఫ్ పార్టనర్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. రకుల్ ని మీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అని అడడగా.. అప్పుడు రకుల్ మీరు ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి నేను కూడా అక్కడినుండే వచ్చాను అని చెప్పింది. నా విషయానికి వస్తే ఎక్కడ నుంచి వచ్చాడని కాదు. కేవలం ఆ వ్యక్తి ఫై ఆధారపడి ఉంటుంది. అలాగని డబ్బు సంపాదన గురించి కాదు. అందరితో కలిసిమెలిసి ఉండాలి, జీవితంలో ఎదో సాధించగలడు అని అనిపించాలి అలాంటి వ్యక్తినే నేను ప్రేమిస్తా అని చెప్పింది.
