భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఒకప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ వేసేవారు. దాంతో అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో ఇంకో రూల్ పెట్టడం జరిగింది. బైక్ వెనుక ఉండేవాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేదంటే 500రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా దానిని పోలీసులు అమలు చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం మొదలైంది. ఏది ఎలా ఉన్నా మాత్రం గత కొద్దిరోజుల నుండి వెనుక వారు హెల్మెట్ వాడకపోతే వారికి జరిమానా విధిస్తున్నారు.