నవంబర్ నెలలో ఐటీ శాఖ ఏపీకి సంబంధించి ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, ఈరోడ్,ఆగ్రా, పూనే, గోవాలతో పాటు మొత్తం 42 చోట్ల జరిపిన సోదాలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రముఖ వ్యక్తికి 150 కోట్లు ముడుపులు అందినట్లు లెక్కలు తేలినట్టు ఐటీ శాఖ తెలిపింది. మౌలిక సదుపాయాల రంగంలో బోగస్ కాంట్రాక్టులు, బిల్లుల ద్వారా నగదును పోగేసుకునే పెద్ద రాకెట్‌ను ఛేదించాం..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తికి హవాలా ద్వారా రూ.150 కోట్లకు పైగా నగదు అందినట్లు సాక్ష్యాధారాలు లభించాయంటూ ఐటీ శాఖ చేసిన ప్రకటన ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ రాజకీయ ప్రముఖుడు ఎవరనే విషయంపై రాజకీయ, మీడియా వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. అయితే తాజాగా ఆ 150 కోట్లు ఎవరికి అందాయనే విషయంపై ఐటీ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. ముంబై కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ కంపెనీ నుండి 150 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి విరాళాలు వెళ్లాయని ఐటీ అధికారులు అంటున్నారు. టీడీపీ సర్కారు హయాంలో దాదాపు రూ. 2230 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు ఆ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తుంది. ఈ పనులు ఇచ్చినందుకుగానే అప్పట్లో గవర్నమెంట్‌కు చెందిన ప్రముఖ వ్యక్తికి కమీషన్ కింద రూ. 700 కోట్లు చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే చంద్రబాబుకు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో 150 కోట్లు అందాయన్న విషయాన్ని సీబీడీటి బయటపెట్టింది. ఎన్నికల సమయం లో 150 కోట్ల క్యాష్ హైదరాబాద్ మీదుగా విజయవాడకు చేరినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు చంద్రబాబుకు, సదరు గ్రూపుకు ఢిల్లీ ఐటీ- సీబీడీటి నుండి నోటీసులు పంపామని అధికారులు చెబుతున్నారు. అంతే కాదు టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఎన్నికల సమయంలో ఎలక్షన్ ఫండ్ వెళ్లిందని ఐటీ వాఖ అధికారులు ప్రకటించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో పనులు అప్పగించి 50 శాతానికి పైగా కమీషన్లు కొట్టేసిన చంద్రబాబు అవినీతి బాగోతాన్ని త్వరలోనే ఐటీ శాఖ బట్టబయలు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ 150 కోట్ల ముడుపుల బాగోతంలో చంద్రబాబు పాత్రపై ఐటీ శాఖ ఏ క్షణమైనా ప్రెస్‌నోట్ జారీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
