రాయలసీమలో ఆత్మీయ యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ పదే పదే ఏపీ సీఎం జగన్ మతం గురించి, కులం గురించి ప్రశ్నిస్తున్నారు. జగన్ ఇలా చేస్తే..లేదా అలా చేస్తే.. ముఖ్యమంత్రి గారు అని పిలుస్తానని..అప్పటివరకు జగన్ రెడ్డి అనే పిలుస్తానని పవన్ తనదైన స్టైల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా పవన్ విమర్శలపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. తనకు కులాలు, మతాలు లేవంటూనే పవన్ కల్యాణ్ పదే పదే.. మతం, కులం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని మంత్రి నిలదీశారు. ఇలా కుల,మతాల గురించి మాట్లాడేవాళ్లు నాయకులా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాలు, మతాల ప్రస్తావన తెచ్చి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మత కలహాలు రెచ్చగొట్టేందుకు పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ మతం తెలిసే ప్రజలు తెలిసే అధికారం ఇచ్చారని అనిల్‌కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దమ్ము గురించి పవన్ మాట్లాడుతున్నారని.. ఆయన దమ్ము, ధైర్యం ఏంటో ప్రజలకు తెలుసని మంత్రి చెప్పారు. మరి పవన్ కల్యాణ్ సత్తా ఏంటో గత అయిదేళ్లు చూసిన ప్రజలు..ఆయన సత్తాకు తగ్గట్టే రెండు చోట్ల ఓడించారని మంత్రి వెటకారం ఆడారు.. ఇక పవన్ కల్యాణ్ రాయలసీమ కల్చర్‌ను అవహేళన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సీమలో తెల్లచెక్కా, పంచె కట్టుకోవటం అలవాటని..వారికి మాత్రమే పనులు అవుతున్నాయని పవన్ వ్యాఖ్యానించడం సరికాదని అనిల్ అన్నారు. ఇక గోదావరి జిల్లాలకు వెళ్లి రాయలసీమ గూండాలు అని..కడప గూండాలు అని..రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అంటూ గతంలో పవన్ మాట్లాడిన మాటలను మంత్రి అనిల్ గుర్తు చేశారు. ఇప్పుడు రాయలసీమకు వెళ్లి ఒకసారి పచ్చటి పొలాలు అని..మరోసారి కరువు ఉందని..అంటారని…అసలు పవన్ ఎక్కడ ఏం మాట్లాడుతాడో..ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. పవన్ సినిమా డైలాగులు చెప్పినట్లుగా తోలు తీస్తా..తాట తీస్తానంటే..ఎవరివీ తీయలేరని చెప్పారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జగన్ ను అలా పిలుస్తా..ఇలా పిలుస్తా అంటే..ఎలా పిలిచినా పవన్ ను ఎవరు పట్టించుకోరని మంత్రి వ్యాఖ్యానించారు. మొత్తంగా సీఎం జగన్ మతం, కులం గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రి అనిల్‌కుమార్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు.
Tags andhrapradesh counter minister anil kumar yadav Pawan Kalyan politics
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023