Home / ANDHRAPRADESH / అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఆంధ్ర కు 2వ స్థానం, పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించిన కేంద్ర అటవీశాఖ..!

అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఆంధ్ర కు 2వ స్థానం, పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వెల్లడించిన కేంద్ర అటవీశాఖ..!

గడిచిన నాలుగు సంవత్సరాలలో భారత్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ అన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో 2,226గా ఉన్న పులుల సంఖ్య.. నాలుగు సంవత్సరాలలో 750 పెరిగి మొత్తంగా 2,976కి చేరింది. దీనికి కారణమైన మన పర్యావరణ వ్యవస్థ పట్ల మనందరం ఎంతో గర్వించాలి. సింహాలు, పులులు, ఏనుగులు, ఖడ్గమృగాలు భారతీయ సంపద. ఉపరితల వైరస్‌ల కారణంగా అవి చనిపోయినట్లు నివేదికలు పేర్కొంటే దానిపై ప్రత్యేక దర్యాప్తు జరిపి వాస్తవాలను నిర్థారించుకోవాల్సిన అవసరం ఉంది. అని మంత్రి పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా 2015 నుంచి 2017 మధ్య పదేళ్ల వ్యవధిలో అటవీ విస్తీర్ణం 6,788 చదరపు కిలోమీటర్లు పెరిగిందని అన్నారు. అడవుల విస్తీర్ణం గణనీయంగా పెరిగిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చర్యలపై ప్రజలలో అవగాహన బాగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat