దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో వరల్డ్ డిసెబుల్ డే సందర్భంగా రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరుగగా ఈ కార్యక్రమానికి కొప్పులతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజతో పాటు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన దివ్యాంగులకు అవార్డ్స్ అందజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దివ్యాంగులకు చేసిన సేవలకు అవార్డు రావడం సంతోషంగా ఉందని చెప్పారు కొప్పుల ఈశ్వర్. ఎన్జీఓ లకు ,దివ్యాంగులకు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం అని తెలిపారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా మన రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని..ఉద్యోగ నియమకలలో 4 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం అన్నారు.
