ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి ఇప్పటివరకు ప్రతీక్షణం ప్రజలు కోసమే ఆలోచించాడు అనడంలో ఎటువంటే సందేహం లేదు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా ఒక్కొకటిగా తీరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రాష్ట్రాన్ని బంగారంగా మార్చేశాడు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో చెయ్యలేని పనులను కేవలం ఆరు నెలలకే చేసి చూపించాడు. తాజాగా జగన్ మరో సంచలన తీసుకున్నారు. ఆదివారం నాడు జిల్లా కల్లెక్టర్లు అందరికి క్షేత్రస్థాయిలో పర్యటనలు చెయ్యాలని ఆదేశించారు. నెలలో 15రోజులు మీరు క్షేత్రస్థాయికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అన్నారు. కొంత మంది క్షేత్రస్థాయి పర్యటనకు వెల్లడంలేదని తెలిసిందని..ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా పని చెయ్యాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లు, టెలీ కాన్ఫరెన్సుల వల్ల పని జరగదని. ప్రజల మధ్యకు వెళ్తేనే వారి సమస్యలు పూర్తిగా తెలుసుకోవచ్చని అన్నారు.
Home / ANDHRAPRADESH / ఇది జగన్ అంటే.. వీడియో కాన్ఫరెన్స్ కాదు..ప్రజల్లోకి వెళ్తేనే వారి కష్టాలు తెలుస్తాయి !
Tags ap collectors jagan people politics ysrcp