సయీద్ ముస్తాక్ అలీ ట్రోపీలో లో భాగంగా ఆదివారం నాడు సూరత్ వేదికగా కర్ణాటక, తమిళనాడు మధ్య ఫైనల్ జరిగింది. ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరకి విజయం మాత్రం కర్ణాటకనే వరించింది. మరోపక్క ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తమిళనాడు తక్కువ పరుగులకు కట్టడి చెయ్యలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 180పరుగులు చేసింది. కెప్టెన్ మనిష్ పాండే అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టుకు అండగా నిలిచాడు. తమిళనాడు కూడా చాలా బాగా ఆడినప్పటికీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. గత ఏడాది కూడా కర్ణాటక ఛాంపియన్స్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీ కూడా కర్ణాటకనే గెలుచుకుంది.