తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచుతామని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్టీసీకి చెందిన బస్ పాస్ ల ఛార్జీలను ఖరారు చేసింది. తాజాగా టికెట్ ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది.దీంతో ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులో కనీస ఛార్జీ రూ.8ఉండగా దీన్ని రూ.10లకు పెంచారు. ఇక సెమీ ఎక్స్ ప్రెస్ కనీస ఛార్జీ రూ.10గా నిర్ధారించారు. ఎక్స్ ప్రెస్ కనీస ఛార్జీ రూ.10నుంచి రూ.15లకు పెంచారు. డీలక్స్ ఛార్జీను రూ.15నుండి రూ.20వరకు పెంచింది ప్రభుత్వం. మరోవైపు సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ.25, రాజధాని ,వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35, గరుడ ఏసీ,గరుడ ఫ్లస్ ఏసీలో రూ.35గా నిర్ణయించారు.
