Home / ANDHRAPRADESH / కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..! 

కావాలనే టీడీపీ టీటీడీలో అన్యమత ప్రచారం అంటూ దుష్ప్రచారం చేస్తోంది..! 

రాజకీయ లబ్ది కోసం టీటీడీ  లో అన్యమత ప్రచారం జరుగుతుందని దుష్ప్రచారం జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.  రాజకీయ లబ్ది కోసమే తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక  ప్రచురణ చేయడం దురదృష్టమని  మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని తిరుమల కీర్తిని దిగజార్చే చర్యలుచేయొద్దని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీని అన్ని మతాల వారు ఓట్లు వేసి గెలిపించారు. టీటీడీలో ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఎలాంటి అన్యమత ప్రచారం జరిగేందుకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గూగుల్‌ నుంచి వివరణ కోరనున్నట్లు  ఆయన తెలిపారు.

 

 

గతంలో కూడా తిరుమలలోని ఏడు కొండలపై సిలువ గుర్తు ఉందంటూ, బస్సు టికెట్ లో ఇతర మతాల గుర్తులు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేసారని టీటీడీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ వెబ్‌సైట్‌లో దుష్ర్పచారం జరగకుండా ఉండేందుకు సైబర్‌క్రైమ్‌ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరతామని వెల్లడించారు. వివాదానికి కారణమైన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాలకమండలిలో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

 

 

టీటీడీ పంచాంగంలో శ్రీయైనమః పదానికి బదులుగా గూగుల్ అనువాదంలో శ్రీయేసయ్య నమః అని వచ్చినట్లు తెలిపారు. ఫోటోగ్రాఫ్ లో ఉన్న పదాలను ప్రాంతీయ భాషల్లో అనువాదం చేయడంలో గూగుల్ లో పొరపాట్లు జరుగుతుంటాయని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా ఏ నిర్ణయం తీసుకోక ముందే  మీడియాలో చర్చలు పెట్టి తిరుమల దేవస్థానం కీర్తిని దిగజారుస్తున్నారని  అసలు అన్యమత ప్రచారం చేస్తున్న విషయం టీటీడీ వెబ్‌సైట్లో లేదని, గూగుల్‌ సెర్చ్‌లో మాత్రమే అది కనిపిస్తోందని పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat