తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ ను తప్పించనున్నారా..?. రానున్న మూడు రోజుల్లోనే చీఫ్ ను మార్చేస్తున్నారా..?. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరిగాయా..?. అంటే అవుననే వార్తలు వస్తోన్నాయి.
ఈ క్రమంలో బీజేపీ చీఫ్ ఎంపిక తుది దశకు చేరుకుంది అని సమాచారం. ఈ రేసులో ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ,మాజీ మంత్రి డీకే అరుణ,మురళీధర్ రావు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తోన్నాయి.
బీజేపీ నేత కృష్ణదాస్ జరిపిన అభిప్రాయ సేకరణలో ఎక్కువమంది లక్ష్మణ్ వైపు మొగ్గిచూపారని వార్తలు వస్తోన్నాయి. ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేరును సైతం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తోన్నాయి.