తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై , రోడ్లపై ఉండే అభాగ్యాలుకు, అనాథలకు నీడను ఇచ్చేల రెండు నైట్ షెల్టర్స్ , మనకు అవసరం లేకున్నా ఇతరుల కు అవసరం అయ్యేలా ఉపయోగ పడేలా రైతు బజార్ వద్ద మానవత్వపు గది అన్నారు.
అదే విధంగా ఫంక్షన్ లలో , మన ఇంట్లో మిగిలి పోయిన ఆహార పదార్థాలు వృధా కాకుండా పేదలకు, అనాథలకు ఉపయోగ పడేలా ఫుడ్ ఏక్సిడ్ స్టోరేజ్ ఫ్రిడ్జ్ మన పాత బస్టాండ్, ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసాం..ఇలాంటివి మన సిద్దిపేట లో ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉంది.. ఇది పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని పేదలకు అనాథకు అండగా ఉందాం..10 చేతులు కలుపుదాం..10 మందికి చేయూత నిద్దాం..మానవత్వం చాటుకుందామని ఆయన అన్నారు.