నగరి ఎమ్మెల్యే , ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా. నగరి 10వ వార్డులో వార్డు వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వార్డు సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఇప్పటికే నగరిలో నో ప్లాస్టిక్ నినాదంతో దూసుకుపోతున్న రోజా ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకొచ్చేవారికి కిలో బియ్యం ఆఫర్ ప్రకటించారు. నిండ్ర మండలం కొప్పేడు నందు ప్లాస్టిక్ వాడకం నివారణకై ర్యాలీగా వచ్చి అవగాహన కల్పించారు. ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలు తెచ్చిన వారికి ఒక కిలో బియ్యం అందించారు.
ఈసందర్భంగా వార్డు సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పలువురు రోజాకు తమ ఇబ్బందులు విన్నవించుకున్నారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నగరి మున్సిపాలిటీ పదో వార్డు నందు అంచనా విలువ నాలుగు లక్షలు కలిగిన సిమెంటు రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. నిండ్ర మండలం అగరం పేట గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతు జయంతి కుటుంబ సభ్యులను రోజా పరామర్శించారు. వైస్సార్ రైతు భీమా ద్వారా 7 లక్షల రూపాయల చెక్కును రోజా అందించారు. జగనన్న ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాల పనితీరును పరిశీలించి వాటి పై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.