మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చమటలు పట్టించాడు. తాను ఎమ్మెల్సీగా కూడా సరిపోడని చాలామంది నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం అందరికి తెలిసిందే. మరోపక్క చంద్రబాబు చాలా తెలివిగా కొడుకుని ఎమ్మెల్సీ చేసి ఐటీ మంత్రిని చేసి ఆ పదివికి ఉన్న గౌరవాన్ని పోగొట్టారు అని అన్నారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి..”ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్రత కోసం కేంద్రం ఇచ్చిన 58 కోట్లను చిట్టి నాయుడు సింగపూరుకు మళ్ళించేశాడు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం యాప్ తయారీకి ఖర్చు చేసినట్లు మస్కా కొట్టాడు.ఇప్పుడు మహిళల భద్రతపై బెంగ నటిస్తున్నాడు.58 కోట్ల స్కామ్‌పై విచారణ జరుగుతోంది. ఒపికపట్టు చిట్టీ”! అని అన్నారు.