కొత్త బ్రీత్ ఎనలైజర్ టెక్నాలజీ పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కిన కొంతమంది పైరవీలు చేసి వేరేవ్యక్తి పేరుతో కేసులు నమోదు చేయించి కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మద్యం రాయుళ్ల ఆటకట్టించేందుకు ఇప్పుడు కొత్త బ్రీత్ ఎనలైజర్లు పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఆల్కహాల్ శాతంతో పాటు, వ్యక్తిపోటో, పరీక్ష సమయంలో వీడియో రికార్డింగ్ వస్తుంది.
దీంతో ఇక మద్యం సేవించి వాహనం నడిపిన వారు పోలీసులకు చిక్కితే కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలిసిందే సత్యనారాయణపురం ఫుడ్జంక్షన్ వద్ద మూడవ ట్రాఫిక్ పోలీస్టేషన్ సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో శనివారం సిబ్బంది కొత్త మిషన్లతో పరీక్షలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారిపై కేసులు నమోదు చేశారు. పలు వాహనాలను సీజ్ చేశారు. కొత్త బ్రీత్ ఎనలైజర్ టెక్నాలజీ పనితీరును పరీక్షించెందుకే ట్రైల్ వర్షన్ లా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.