ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 6 నెలలలోపే 60% వరకు హామీలను అమలుచేసి నిరుద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా 4లక్షల ఉద్యోగావకాశాలు కల్పించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. మద్యపాన నిషేధ విషయమై కేరళ తరహాలో నీరా డ్రింక్ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు కట్టి తీసుకెళ్తే నేరమని శిక్షార్హులు అవుతారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేస్తోన్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తున్నారని వాటి వల్ల ఏ ఉపయోగము ఉండబోదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో లోకేష్‌కు దోచిపెట్టడమే సరిపోయిందని మార్గాని భరత్ విమర్శించారు. సిఎం జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తున్నారని అన్నారు.