గత నాలుగేళ్లుగా టెలికాం సంస్థలు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరలకే తమ సేవలు అందించాయి ఇకపై అలాంటి సేవలకు టెలికాం రంగంలో దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ స్వస్థి పలుకుతున్నాయి. గత నాలుగేళ్లలోనే తొలిసారిగా ప్రీపెయిడ్ చందాదార్లకు కాల్, డేటా ఛార్జీ (టారిఫ్)లు ఈనెల 3 నుంచి పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఛార్జీల పెరుగుదల 50 శాతం వరకు ఉండనుందని సమాచారం. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసల చొప్పున ఇప్పటికే వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న నెలసరి కనీస రుసుము రూ.35 నుండి రూ.49తో కు పెంచారు. రూ.49 చేయిస్తేనే చందాదార్లు ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోగలుగుతారు. ఈనెల 6 నుంచి 40 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు, సరికొత్త అపరిమిత వినియోగ పథకాలు ఆవిష్కరించనున్నట్లు తెల్పింది.కాల్స్, డేటా ఛార్జీలు 40 శాతం వరకు పెరగనున్నాయి. కొత్త పథకాల కింద చందాదారులకు 300 శాతం అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు పరిమితి విధిస్తామని
రిలయన్స్ జియో వెల్లడించింది.