యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్య కేసు గురించి నిందితులు పోలీసు విచారణలో సంచలన విషయాలు తెలిపారు. వారు మాట్లాడుతూ” ఏమో సారు. అప్పుడు మేము బాగా తాగి ఉన్నాము.
ఏం చేస్తున్నామో .. సోయి లేదు. పొద్దున్నుంచి ఖాళీగా లారీలో కూర్చొని విసుగు పుట్టింది. ఒంటరిగా కన్పించిన ప్రియాంకరెడ్డి కన్పించగానే ఏదో ఒకటి చేయాలని అనుకున్నామని తెలిపారు.
వారు ఇంకా మాట్లాడుతూ” రాత్రి 9గంటల తర్వాతే దిషా రావడంతో హాడావుడిగా లారీలో నుంచి కిందకు దిగారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని మద్యం తాగుతూ నిర్ణయించుకున్నాము. ఆమెను చంపేసి కాల్చేస్తే ఇంతదూరం వస్తదనుకోలేదని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.