ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం మనకు విదితమే.
ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి కూడా.
మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా జియో డిసెంబర్ 6వ తేదీన నూతన ఆలిన్ వన్ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న ప్లాన్ల ధరలు 40 శాతం వరకు పెరుగుతాయని జియో వెల్లడించింది.