తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల డిసెంబర్ రెండో వారంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
డిసెంబర్ లోనే మొత్తం 121మున్సిపాలిటీలు,10కార్పోరేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల ప్రక్రియను వేగవంతం చేసింది.
2018అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికలు జరపనున్నది.