తమిళనాడులోని ఘోర ప్రమాదం జరిగింది. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద నాలుగు భవనాలు కూలడంతో పదిహేను మందికి పైగా కూలీలు మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వారంతా గాడ నిద్రలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వారంతా భవనాలు కూలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంకా కొందరు రాళ్ల మధ్యలో ఎక్కడైనా చిక్కుకొని ఉండొచ్చని అంటున్నారు. సహాయక సిబ్బంది ఇప్పటికే చర్యలు చేపట్టారు. అఒతే గత రెండురోజులుగా ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎందరు మరణించారు, అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటీ అనేది ఇంకా తెలియాల్సి ఉంది.