తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు దాదాపు యాబై రెండు రోజులు సమ్మె నిర్వహించిన సంగతి విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో కార్మికులు విధుల్లోకి చేరారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కూడా కురిపించారు. దీనిపై రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టు స్పందిస్తూ” ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం సుఖాంతమైంది అని వ్యాఖ్యానించింది. కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను చేపట్టిన హైకోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకుంది కదా.. వాళ్ళ ఉద్యోగాలకు కూడా భద్రత కూడా కల్పించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతమైంది అని వ్యాఖ్యానించింది.
