ఏపీ సీఎం జగన్ పాలన ఆర్నెళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఆరు నెలలో దాదాపు 150కు పైగా సంక్షేమ పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజల మనసుల్లో మంచి ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. రైతు భరోసాతో రైతన్నలు, గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీతో యువత, అమ్మఒడితో మహిళలు, ఏటా రూ. 10, 000/- ఆర్థికసాయంతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, మత్స్యకార్మికులు , వేతనాల పెంపుతో ఆశావర్కర్లు, 108 ఉద్యోగులు, వీఏవోలు వంటి చిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్ ప్రజారంజక పాలనకు జై కొడుతున్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాత్రం…ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ప్రభుత్వం ఏర్పడి వారం కూడా కాకముందే విమర్శించడం మొదలుపెట్టాడు..రాజధాని తరలింపు, పోలవరం, పల్నాడు దాడులు, ఇంగ్లీష్ మీడియం, ఇసుక కొరత ఇలా ప్రతి అంశంపై ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడు. అంతే కాదు జిల్లాలలో టీడీపీ కార్యకర్తలతో సమావేశాలు పెడుతూ..అక్కడ కూడా పార్టీ క్యాడర్‌కు మనోబలం ఇచ్చేది పోయి..తిరుమల డిక్లరేషన్ అంటూ సీఎం జగన్‌పై దిగజారుడు విమర్శలు చేస్తూ..మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. కడపలో పర్యటించిన చంద్రబాబు పార్టీ సమీక్షా సమావేశం నిమిత్తం కర్నూలుకు రానున్నాడు. చంద్రబాబు కర్నూలుకు వస్తున్న సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేత బి.వై. రామయ్య ఆదివారం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే చాలు.. లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబుకు జిల్లాలో అడుగుపెట్టే ఆర్హత లేదని, విమర్శించారు. జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఫెయిలైన చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా అట్టర్ ప్లాప్ అయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు చెప్పు లక్ష బహుమతి ఇస్తానంటూ వైసీపీ నేత రామయ్య చేసిన బంపర్ ఆఫర్‌పై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఏంటీ రామయ్య..చంద్రబాబుకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏంటో ఒక్కటి చెప్పమను..అవే చెప్పలేడు..ఇక సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఏం చెబుతాడు..ఆయన చెప్పలేనడేగా లక్ష పందెం కాశారంటూ జోకులు వేస్తున్నారు.
