తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం 97డిపోలకు చెందిన ఐదుగురు కార్మికుల చొప్పున 485 మందితో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు ఆదివారం మధ్యాహ్నాం రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, ఆర్టీసీ బాగోగుల గురించి.. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాలపై పలు అంశాల గురించి చర్చించనున్నారు. ఇటీవల సమ్మె విరమణ భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను భేషరత్తుగా విధుల్లో చేరమని కోరిన సంగతి విదితమే..