తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది.
ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా తన ట్విట్టర్లో ప్రియాంక రెడ్డి హత్యపై స్పందించారు. రోజు రోజుకు, నెల నెలకు, సంవత్సర సంవత్సరానికి ..ఏం మారడం లేదు. సమాజంగా మనం విఫలమవుతూనే ఉన్నాం.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకి నా ప్రత్యేక విజ్ఞప్తి. మనకు కఠినమైన చట్టాలు కావాలి, ఇలాంటి ఘోరమైన నేరాలకి మరణశిక్ష విధించాలని మహేష్ కేటీఆర్, పీఎమ్ఓ ఇండియాలని ట్యాగ్ చేశారు. అంతేకా ప్రియాం రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీకు జరిగిన దారుణం ఎవరు తీర్చలేనింది. మనదేశంలోని మహిళలకి, యువతులకి న్యాయం చేయడానికి అందరం కలిసి నడుద్దాం.. భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుదాం !!అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.